‘అవతార్ 3’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్!

AVATRA

హాలీవుడ్ సెన్సేషనల్ సినిమా అవతార్ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు మూడో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి అవతార్ ది ఫైర్ అండ్ ఆష్ అనే టైటిల్ ని పెట్టారు. మరి ఫైనల్ గా నేడు ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ ని మేకర్స్ వదిలారు. సినిమా టైటిల్ ని ప్రతిబింబిస్తూ ఈ పోస్టర్ ఉందని చెప్పవచ్చు.

ఇక ట్రైలర్ పై కూడా సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ శుక్రవారం వస్తున్న ఫెంటాస్టిక్ 4 తో థియేటర్స్ లో ఈ ట్రైలర్ ప్రదర్శించనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి జేమ్స్ కామరోన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఎండింగ్ లో విడుదల కానుంది.

Exit mobile version