హైదరాబాదులో ఆటో నగర్ సూర్య షూటింగ్

హైదరాబాదులో ఆటో నగర్ సూర్య షూటింగ్

Published on Apr 1, 2012 8:30 PM IST


అక్కినేని నాగ చైతన్య మరియు సమంతా జంటగా నటిస్తున్న ఆటో నగర్ సూర్య చిత్రం తరువాతి షెడ్యుల్ ఏప్రిల్ 5 నుండి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 60% టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైదరాబాదులో ప్రత్యేకంగా వేయించిన సెట్లో షూటింగ్ చేయనున్నారు. విమర్శకులు మెచ్చే దర్శకుడు దేవకట్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎన్నికలకు సంభందించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సమంతా మొదటిసారి మాస్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇటీవలే పూలరంగడు, ఇష్క్ వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు