టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఆటో నగర్ సూర్య


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ సినిమా ‘ఆటో నగర్ సూర్య’ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబందించిన రెండు పాటల చిత్రీకరణ మాత్రమే ఇంకా మిగిలి ఉంది. వాటిని కూడా త్వరలో షూటింగ్ పూర్తి చేసి నవంబర్ రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏ మాయ చేసావే తరువాత నాగ చైతన్యకి సమంతా మళ్లీ నటిస్తున్న ఈ సినిమాకి దేవకట్ట దర్శకుడు. విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Exit mobile version