బన్నీ సాంగ్ కి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టెప్స్

అల వైకుంఠపురంలో మూవీ ఎంత విజయం సాధించిందో అంతకు మించిన ఆదరణ సాంగ్స్ దక్కించుకున్నాయి. థమన్ కంపోజ్ చేసిన అల వైకుంఠపురంలో సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపాయి. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ సాంగ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వంటివారితో పాటు మరికొందరు సెలెబ్రిటీలు ఈ సాంగ్ కి స్టెప్స్ వేయడం జరిగింది.

కాగా ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తన భార్య తో పాటు బుట్ట బొమ్మ సాంగ్ కి స్టెప్స్ వేసి అలరించాడు. డేవిడ్ తన భార్య కాన్డైస్ ఫల్జోన్ కలిసి బుట్ట బొమ్మ సాంగ్ కి డాన్స్ వేసి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంటర్నేషల్ లెవెల్ లో థమన్ సాంగ్స్ అలరిస్తున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

Exit mobile version