ప్రేక్షకులు కామెడీ కోరుకుంటున్నారు: నరేష్

ప్రేక్షకులు కామెడీ కోరుకుంటున్నారు: నరేష్

Published on Mar 16, 2012 8:25 AM IST


తనకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ఏర్పరుచుకున్న హీరో అల్లరి నరేష్. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుంటాడు నరేష్. నరేష్ నటించిన కొత్త చిత్రం ‘నువ్వా నేనా’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కింది. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. మీరు ఎందుకు ఎక్కువ కామెడీ సినిమాలు చేస్తున్నారు అని అడగగా, ప్రేక్షకులు నా నుండి కామెడీ కోరుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా మెలోడ్రామ, సెంటిమెంట్ సినిమాలు కూడా ప్రయత్నాలు చేశాను కాని అవి ఆశించిన విజయం సాధించలేదు. అల్లరి నరేష్, శర్వానంద్ మరియు శ్రియ ముఖ్య పాత్రల్లో నటించిన నువ్వా నేనా చిత్రం ఈ రోజే విడుదల కాబోతుంది.

తాజా వార్తలు