నైజాంలో 15 కోట్ల మార్క్ క్రాస్ చేసిన అత్తారింటికి దారేది

attarintiki-daredi

పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామినాని మరోసారి నిరూపించుకుంటున్నాడు. ఈ సినిమా విడుదలైన అన్ని ఎరియాల్లోనూ కలెక్షన్ల వరద కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లో ఒక్క నైజాంలోనే 15 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్ సృష్టించింది. మిగిలిన ఏరియాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

సమైక్యాంధ్రలో బందుల వల్ల కొన్ని చోట్ల మాత్రం రెండవ వారంలో కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశం కనపడుతోంది. కానీ షోస్ పడే అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సినిమా అల్ టైం రికార్డ్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల జాబితాలో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లిస్టులో ఈ సినిమానే నెంబర్ వన్ అవుతుందా? అనేదాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

పవన్ కళ్యాణ్ – సమంత జంటగా నటించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

Exit mobile version