సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతిథి’ చిత్రంలో కథానాయకిగా నటించిన అమృతరావ్ గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె చేసిన ఏకైక సినిమా ఇదే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నటనకు, అందానికి మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ పుషకాలంగా ఉన్నాయని అనుకున్నారు. కానీ చిత్రంగా ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు అమృతరావ్. పూర్తిగా బాలీవుడ్ పరిశ్రమకే పరిమితమైంది.
ఇప్పుడీమె తల్లి కాబోతోంది. ఇన్నాళ్లు తాను గర్భవతిని అనే విషయాన్ని అమృతరావ్ గోప్యంగా ఉంచగా తాజాగా ఆమె చెకప్ నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా కొందరు ఆమె ఫోటోలను క్లిక్ మనిపించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో కొద్దిసేపటికే ఆ ఫోటోలు కాస్త వైరల్ అయిపోయాయి. ఫాన్స్ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. 2016లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫెండ్ అన్మోల్ ను వివాహం చేసుకుంది అమృతరావ్. బాలీవుడ్ హీరోయిన్స్ అంటే ఏదో ఒక విషయాల్లో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. కానీ అమృతరావ్ అలా కాదు. చాలా ప్రయివేట్ పర్సన్. పెళ్ళైన విషయాన్ని కూడ కొన్నిరోజులు దాచిపెట్టారామె. అందుకే ఆమె ప్రెగ్నెంట్ అనే సంగతి కూడ ఆలస్యంగా బయటికొచ్చింది.