పవన్ అత్తారింటికి దారేది సెన్సార్ డేట్

పవన్ అత్తారింటికి దారేది సెన్సార్ డేట్

Published on Jul 24, 2013 7:07 PM IST

Attarintiki_Daredi_Latest_Wallpapers (3)
తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 2న సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ – సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రణిత కనిపించనుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సమాచారం ప్రకారం 40 మంది నటీనటులు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. త్రివిక్రమ్ మార్క్ కలిగిన డైలాగ్స్, ఫుల్ కామెడీ ఉండే ఫమిల్య్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు