సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన ఎవర్ గ్రీన్ చిత్రం అతడు కూడా ఒకటి. మరి ఎంతో అవైటెడ్ గా ఉన్న ఈ రీ రిలీజ్ ఫైనల్ గా థియేటర్స్ లో వస్తుండగా యూఎస్ మార్కెట్ లో కూడా అదిరే ఓపెనింగ్స్ తో ఈ సినిమా రాబోతుంది.
మహేష్ బాబు సినిమాలకి గ్రాండ్ ఓపెనింగ్స్ ఉంటాయని తెలిసిందే. ఇలానే అతడు కూడా విడుదలకి ముందే సాలిడ్ నంబర్స్ అందుకున్నాడు. ఇలా లేటెస్ట్ గా అప్పుడే 50 వేల డాలర్లు మార్క్ ని ఈ సినిమా దాటేసి ఆదరగొట్టింది. ఇక ఫుల్ రన్ లో మహేష్ తన రికార్డ్స్ తనే బ్రేక్ చేసుకుంటారేమో చూడాలి.