రెండు తెలుగు రాష్ట్రాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. నిజ జీవిత యోధుడు వీరమల్లు జీవిత కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సహా జ్యోతికృష్ణలు తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు విడుదలకి సిద్ధం అవుతుండగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు.
ఇలా నేడు సినిమా మూడో సాంగ్ ని విడుదల చేయగా ఈ సాంగ్ అనుకున్నట్టుగానే మంచి పవర్ ఫుల్లుగా ఉందని చెప్పాలి. కీరవాణి ఇచ్చిన ట్యూన్ సహా రాంబాబు గోసల సాహిత్యం అంతే స్టన్నింగ్ గా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం ప్లే బ్యాక్ సింగర్స్ తోనే పాడించిన ఈ పాట ఉత్సాహంగా సాగింది. అలాగే లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా బాగున్నాయి.
అంతే కాకుండా పవన్ పై పలు పోరాట సన్నివేశాల దృశ్యాలు కూడా ఈ సాంగ్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండు సింపుల్ సాంగ్స్ తర్వాత మంచి పవర్ తో కూడిన సాంగ్ ని మేకర్స్ ఇపుడు విడుదల చేసారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాణం వహించగా ఈ జూన్ 13న పాన్ ఇండియా భాషల్లో సినిమా విడుదల కాబోతుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి