హీరోయిన్ ఆషిమా నర్వాల్ సిగరెట్ తాగుతూ తన ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఎప్పుడూ గ్లామర్ వలకబోస్తూ ఫోటోలు పెట్టే ఆషిమా ఉన్నట్టుండి స్మోక్ చేస్తూ వీడియో పెట్టడంతో నెటిజన్లు షాకవుతున్నారు. బాలయ్య ఫేమస్ డైలాగ్ ‘డోంట్ ట్రబుల్ థ ట్రబుల్.. ఇఫ్ యు ట్రబుల్ థ ట్రబుల్ థ ట్రబుల్.. ట్రబుల్ విల్ ట్రబుల్స్ యు. ఐయామ్ నాట్ థ ట్రబుల్.. ఐయామ్ థ ట్రూత్’ అంటూ ఆషిమా స్మొకింగ్ వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో వెనుక మంచి మెసేజ్ కూడ ఇచ్చింది ఈ భామ.
మనమంతా భూమాతను ఇబ్బంది పెడుతున్నామని, అందుకే భూమాత తిరిగి మనల్ని ఇబ్బంది పెడుతోందని అందుకే భూమిని ఇబ్బందిపెట్టవద్దని, భూమి అనేది ట్రబుల్ కాదని, అదే అసలైన నిజమని అంటూ హైదరాబాద్ వరద భీభత్సాన్ని గుర్తుచేస్తూ మెసేజ్ ఇచ్చింది. ఇక తాను సిగరెట్ తాగడం చూసి షాకవుతున్న అందరూ కార్లు, స్కూటర్లు, ఫ్యాక్టరీల పొగతో వాతావరణాన్ని కలుషితం చేయడాన్ని గురించి ఎందుకు షాకవ్వట్లేదు. అదే మిమల్ని ఎక్కువగా షాక్ చేయాల్సిన విషయం అంటూ వాతావరణం మనుషుల వలన ఎలా కలుషితం అవుతోందో చెప్పుకొచ్చింది. అలాగే స్మొకింగ్ అనేది ఆరోగ్యానికి హానికరం అంటూ తాను సినిమాల్లోని ఒక పాత్ర కోసం సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.
https://www.instagram.com/p/CGUtCS9Hu7H/