నేడే వరుడు కాబోతున్న ఆర్యన్ రాజేష్

నేడే వరుడు కాబోతున్న ఆర్యన్ రాజేష్

Published on Feb 10, 2012 8:41 AM IST


కీర్తి శేషులు ఈఈవి సత్యనారాయణ గారి అబ్బాయి, కామెడీ కింగ్ అల్లరి నరేష్ సోదరుడు అయిన ఆర్యన్ రాజేష్ వివాహం సుభాషిణితో నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. రాజమండ్రిలో జరగనున్న ఈ వేడుకకి ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు విచ్చేయనున్నారు. వధువు సుభాషిణి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా లోని జేగురుపాడు. రాజేష్, సుభాషిణిల నిశ్చితార్ధం పెద్దల సమక్షంలో జనవరి 30 న జరిగింది.

123తెలుగు.కామ్ తరపున వారికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుందాం.

తాజా వార్తలు