‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’.. షారుఖ్ కొడుకు డెడికేషన్!

 the bads of bollywood

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దగ్గర టాక్ అఫ్ ది టౌన్ ఏదన్నా ఉంది అంటే అది క్రేజీ వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే చెప్పాలి. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకునిగా చేసిన ఈ సిరీస్ లో బాలీవుడ్ నుంచి అనేకమంది స్టార్స్ కలిసి కనిపించడం అనేది ఆసక్తిగా మారింది.

అయితే షారుఖ్ కొడుకు తనకి వారసునిగా హీరోగా వస్తాడు అనుకుంటే దర్శకునిగా మారడం అందరిలో మరింత ఆసక్తి నెలకొల్పింది. ఇక ఈ సిరీస్ ఈవెంట్ లోనే అందరి దృష్టి ఆకర్షించిన ఆర్యన్ ఖాన్ ఇప్పుడు దర్శకునిగా కూడా మంచి అప్లాజ్ అందుకుంటున్నాడు.

అయితే ఈ సిరీస్ కి తన డెడికేషన్ ఎలా ఉంది అనేది కూడా హిందీ మీడియా నుంచి పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేవలం దర్శకునిగానే కాకుండా తన మొదటి సిరీస్ కి చాలా కష్టపడి సెట్స్ తో తాను కనిపించాడు. అందుకే ఈ సిరీస్ వచ్చాక కూడా తన పేరే ఎక్కువగా వినిపించడం విశేషం.

Exit mobile version