పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం పై వస్తున్న వార్తలను క్లియర్ చేయడానికి మార్చి 14న హైదరాబాద్ లో ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటింగ్ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంతమంది సినిమా ప్రముఖులు ఈ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీనియర్ ఫాన్స్ కి, ఆయనకు సపోర్టు చేసే వారికి స్పెషల్ ఇన్విటేషన్ లు పంపనున్నారు. వారందరితో మార్చి 13 న నగరంలో ఆయన కలవనున్నారు. వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం మార్చి 14న పొలిటికల్ ప్లాన్స్ గురించి ప్రకటించనున్నారు. ఈ విషయాలను పవన్ అతని స్నేహితులతో, సలహాదారు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చెప్పినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్, అతని బృందం ప్రస్తుతం రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పార్టీ పేరు, రాజకీయ భవిష్యత్తు, ప్రణాళికలు తెలియాలంటే మార్చి 14 వరకు ఆగాల్సిందే .