టీజర్ టాక్ : ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘సీతా పయనం’

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ తాజాగా నిర్వహించారు.

ఈ చిత్ర టీజర్ ఆద్యంతం ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్ చేసే కార్ జర్నీలో ఆమెకు హీరో పరిచయం కావడం.. ఆ పరిచయం ప్రేమగా మారడం.. ఆ ప్రేమ కోసం వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ‘మ్యాజిక్ ఆఫ్ లవ్’ను దర్శకుడు అర్జున్ సర్జా చాలా ఎమోషనల్‌గా ప్రెజంట్ చేయబోతున్నట్లు ఈ టీజర్ కట్ చూస్తే అర్థమవుతుంది.

ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్నారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, బిత్తిర సత్తి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అర్జున్ సర్జా, ధృవ్ సర్జా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలవబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version