అర్జున్ S/O వైజయంతి ట్రైలర్.. పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 18న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ఫుల్ మాస్, యాక్షన్ అంశాలతో నింపారు. సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి విజయశాంతి మెరిసారు. ఆమె పాత్ర ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఆమె కొడుకు అర్జున్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఆయన చేసే యాక్షన్, చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘కొడుకుని ఆయుధంలా పెంచి యుద్ధం చేయొద్దంటే ఎలా మేడం?’ అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ ట్రైలర్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version