మహేష్ బాబు పాత్రలో అర్జున్ కపూర్

Mahesh-and-Arjun-Kapoor
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఒక్కడు’ సినిమాని ఈ సంవత్సరం హిందీలో రీమేక్ చేయనున్నారు. బాలీవుడ్లో ఈ సినిమాని శ్రీదేవి భర్త భోనీ కపూర్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో భోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ హీరోగా నటించనున్నాడు. ‘ఇషాక్ జాదే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అర్జున్ కపూర్ ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాల షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అబ్బాస్ – మస్తాన్ లు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ వేటలో ఉన్నారు.

Exit mobile version