ప్రభాస్ ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. 500కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పలు భాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్ ని అనేక చిత్ర పరిశ్రమల నుండి తీసుకోనున్నారని టాక్. కాగా ఈ సినిమాలో ప్రభాస్ విలన్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
తమిళ నటుడు అరవింద స్వామిని ఈ చిత్రంలో విలన్ గా తీసుకోనున్నారట. దీనిపై ఇప్పటికే అరవింద స్వామితో చర్చలు జరిపారని టాక్. ఇక రామ్ చరణ్ హీరోగా తని ఒరువన్ కి రీమేక్ గా వచ్చిన ధృవ సినిమాలో అరవిందస్వామి ఇంటెలిజెంట్ విలన్ రోల్ చేశాడు. ఈ విషయంపై స్పష్టత రావాలి అంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 2021లో మూవీ పూర్తి చేసి 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.