ఇది “ఏ ఫిలిం బై అరవింద్” కన్నా ఎక్కువగా థ్రిల్ చేస్తుంది -శేఖర్ సూరి

ఇది “ఏ ఫిలిం బై అరవింద్” కన్నా ఎక్కువగా థ్రిల్ చేస్తుంది -శేఖర్ సూరి

Published on Jan 19, 2013 1:51 AM IST

aravind2
హారర్ చిత్రాల పంథా మార్చిన చిత్రాలలో “ఏ ఫిలిం బై అరవింద్” ఒకటి, కథనం విషయంలో చాల పటిష్టంగా సాగే ఈ చిత్రానికి శేఖర్ సూరి దర్శకత్వం వహించారు. అయన ప్రస్తుతం “అరవింద్ – 2” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. “ఈ రోజుల్లో” ఫేం శ్రీ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.”ఈ చిత్రం ఏ ఫిలిం బై అరవింద్” చిత్రం కన్నా మూడు రెట్లు ఎక్కువ థ్రిల్ కి గురి చేస్తుంది” అని దర్శకుడు అన్నారు మేకప్ పరంగా ఈ చిత్రం హాలివుడ్ స్థాయిలో ఉంటుంది అని శేఖర్ సూరి అన్నారు. మాధవిలత, అడోనికా, కమల్ కామరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి విజయ్ కురాకుల సంగీతం అందించగా రాజేంద్ర బాబు సినిమాటోగ్రఫీ అందించారు. విజయభేరి ప్రొడక్షన్స్ పతాకంపై జి. ఫణింద్ర (రవి), జి. విజయ్‌చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు