పెద్ది’తో ఆయన స్ట్రాంగ్ కమ్‌బ్యాక్..!

పెద్ది’తో ఆయన స్ట్రాంగ్ కమ్‌బ్యాక్..!

Published on Nov 25, 2025 9:03 PM IST

AR rehman

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పో్ర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ‘చికిరి చికిరి’ సాంగ్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. ఈ పాట ఏకంగా 100 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాతో ఏఆర్ రెహమాన్ గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నాడని తెలియగానే చాలా మంది డౌట్ పడ్డారు.

కానీ, కేవలం ‘చికిరి చికిరి’ పాటతోనే ఆయన తన సత్తా మరోసారి చాటారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని రెండో పాటను కూడా ఆయన ‘చికిరి’కి మంచి ఉండేలా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఒకవేళ ఆ పాట కూడా సూపర్ హిట్ అయితే, ఇక రెహమాన్ మ్యూజిక్‌కు తిరుగే ఉండదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు