ఎట్టకేలకు నవీన్ పొలిశెట్టి కూడా మొదలెట్టాడు.. ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్!

ఎట్టకేలకు నవీన్ పొలిశెట్టి కూడా మొదలెట్టాడు.. ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్!

Published on Nov 25, 2025 5:01 PM IST

Anaganaga-Oka-Raju

టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ఎప్పుడో షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ సినిమాను సంక్రాంతి 2026 కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇటీవల ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తారేమో అనే చర్చ మొదలైంది.

అయితే, ఆ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు వారు రెడీ అయ్యారు. ‘భీమవరం బల్మ’ అంటూ సాగే ఈ పాటను నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. కాగా ఈ పాటను పాడింది కూడా నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. ఇక ఈ సినిమా నుండి వరుస అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు.

మారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఔట్ అండ్ ఔట్ కామెడీ రోల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు