ఇద్దరమ్మాయిలతో కోసం పాట పాడిన యుకె పాప్ సింగర్

Pop Singer

అతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న పాప్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అపాచే ఇండియన్ టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తో జత కలిసాడు. దేవీ శ్రీ ఇతని చేత ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఓ పాటని పాడించారు. అపాచే ఇండియన్ రెండు దశాబ్దాల కేరీర్లో తెలుగు సాంగ్ పాడటం ఇదే మొదటి సారి కావడం విశేషం. స్వతహాగా ఇంగ్లాండ్ కి చెందిన అపాచే ఇండియన్ 2011లో యుకె ఆసియన్ అవార్డ్స్ లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు గెలుచుకున్నాడు. 1990లలో ఉన్న మోస్ట్ పాపులర్ సింగర్స్ లలో ఇతను కూడా ఒకరు. ఇద్దరమ్మాయిలతో సినిమా మ్యూజికల్ లవ్ స్టొరీ కావడంతో దేవీ శ్రీ ఈ సినిమా కోసం మెలోడీ, పాప్ అని అన్నిరకాల సాంగ్స్ ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు.

ఇద్దరమ్మాయిలతో సాంగ్ పాడడం కోసం అపాచే ఇండియన్ యుకె నుంచ్డి ఇండియా వచ్చి దేవీ శ్రీ స్టుడియోలో సందడి చేసాడు. ఇద్దరమ్మాయిలతో ఆడియో రేపు హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది. అల్లు అర్జున్, కేథరిన్, అమలా పాల్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్టర్. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాని మే 24న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version