యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిర్చి’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో యోగా బ్యూటీ అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుష్క తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోనుంది. అలాగే ఈ సినిమాలో అనుష్క చేస్తున్న పాత్రకి తన ఒరిజినల్ వాయిస్ బాగా మ్యాచ్ అయ్యిందని ప్రొడక్షన్ టీం అంటోంది.
కొరటాల శివ దరకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వంశీ కృష్ణా రెడ్డి – ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.