పొడుగుకాళ్ళ సుందరి అనుష్క నటిస్తున్న ‘వర్ణ’ సినిమాలో ఆమె రెండు విభిన్న పాత్రలను పోషిస్తుంది. ఈ సినిమా నిర్మాతలు పి.వి.పి బ్యానర్ పై చిత్రాన్ని తమిళ మరియు తెలుగు భాషలలొ ఏకకాలంలో నవంబర్ 1 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన కధలో ఆర్య హీరో. ఇది ఒక కొత్త రకం ప్రేమకధ అని సమాచారం
హారిస్ జయరాజ్ స్వరపరిచిన సంగీతం ఇప్పటికే తమిళ్ లో విడుదల అయ్యాయి. చారిత్రాత్మక నేపధ్యంలో వినూత్నమైన సినిమాలను తెరకెక్కించే సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. అక్టోబర్ 1 నుండి తెలుగులో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు