నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోన్న ‘అనుష్క’ క్యాష్ ప్రోమో !

నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోన్న ‘అనుష్క’ క్యాష్ ప్రోమో !

Published on Mar 19, 2020 12:27 PM IST

బుల్లితెర పై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘క్యాష్’ ప్రోగ్రామ్ కి సంబధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నిన్న ఈ షోకి సంబంధించి అనుష్క పాల్గొన్న లేటెస్ట్ ప్రోమో ఒకటి విడుదల చేశారు. కాగా ఈ ప్రోమో అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్ లో సంచలనం రేపుతున్నది. ప్రోమోలో అనుష్క గ్రాండ్ ఎంట్రీతో పాటు ప్రోమో కాన్సెప్ట్, ఫన్ అండ్ పంచ్ లు కూడా బాగా పేలాయి. అలాగే, ఎండింగ్ లో ఇచ్చిన ఎమోషనల్ టచ్ తో పాటు అనుష్క, ప్రభాస్‌ తో తన స్నేహం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ ప్రోమోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వీటికి తోడు, సుమ కామెడీ టైమింగ్ అండ్ మధ్య మధ్యలో ‘సుమ – అనుష్క’లతో పాటు మిగిలిన వాళ్ళ ఫన్నీ డిస్కషన్స్ కూడా హైలైట్‌ గా అనిపించిది. దాంతో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఈ ప్రోమో ట్రెండ్ అవుతుంది. కేవలం విడుదలైన కొన్ని గంటల్లోనే 1,7 మిలియన్ల మంది ఈ ప్రోమోను వీక్షించారు. పైగా ఈ ప్రోమో ఒక్కరోజులోనే 54 కె లైక్స్ ను సాధించడం గమనార్హం. ఇంతకీ… ఈ ప్రోమో ఎండింగ్ లో అనుష్క ఎందుకు కన్నీరు పెట్టుకుందో తెలియాలంటే మాత్రం, శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ ను తప్పక వీక్షించాల్సిందే.

తాజా వార్తలు