సింగం 2 ని పూర్తి చెయ్యడానికి సిద్ధమైన అనుష్క

సింగం 2 ని పూర్తి చెయ్యడానికి సిద్ధమైన అనుష్క

Published on Apr 1, 2013 11:45 PM IST

Anushka-3
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘బాహుబలి’ మరియు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాలో నటిస్తున్న అనుష్క , ఆ చిత్రాలు మొదలయ్యేలోపే ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్లను వీలైనంత త్వరగా ముగించాలనుకుంటుంది. కొన్ని రోజుల క్రితం సెల్వరాఘవన్ సినిమా ‘బృందావనంలో నందకుమారుడు’ సినిమాకోసం రాజమండ్రిలో షూటింగ్ పల్గున్న తను, ఇప్పుడు సూర్య సరసన నటిస్తున్న’సింగం 2′ లో మాస్ పాటకు కలిసి స్టెప్పులు వేస్తుంది. చెన్నైలో చిత్రీకరిస్తున్న ఈ పాట మినహా మిగిలిన షూటింగ్ అంతా ఏప్రిల్ మొదటివారంలో పూర్తవనుంది. ‘యముడు’ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో సూర్య, అనుష్క మరియు హన్సిక ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాకి హరి దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు