రాజమండ్రిలో అనుష్క – ఆర్య సినిమా షూటింగ్

anushkaమిర్చి సినిమాతో అనుష్క మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రభాస్ సరసన రెండవసారి నటించి బబ్లీ క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు పొందుతోంది. ప్రభాస్, అనుష్క జంట మరోసారి కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ కలిసి రాజమౌళి తెరకెక్కించనున్న బాహుబలి సినిమాలో కలిసి నటించబోతున్నారు. ఇదిలా ఉండగా అనుష్క ప్రస్తుతం రాజమండ్రి వెళ్ళింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఆర్య హీరోగా నటిస్తున్న బృందావనంలో నందకుమారుడు సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది. ఈ షూటింగ్ నిమిత్తం అనుష్క రాజమండ్రి వెళ్ళింది. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతుంది.

Exit mobile version