అనుష్క కెరీర్ లో ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ వారం తను నటించిన ‘సింగం’ సినిమా విడుదలకానుంది. అలాగే తన చేతిలో మరో రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అనుష్క ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘రుద్రమ దేవి’, దీనితో పాటు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రానున్న’బాహుబలి’ సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా వుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనుష్క చేస్తున్న ఈ రెండు సినిమాలలోని పాత్రలు దాదాపు ఒకే నేపథ్యానికి సంబందించినవి. ఈ రెండు సినిమాలలో కూడా అనుష్క చారిత్రాత్మక నేపథ్యం సంబందించిన పాత్రలలో నటిస్తోంది. ఈ సినిమాల విజయం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తోంది. గతంలో అనుష్క ‘అరుంధతి’ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందింది. మరికొద్ది రోజులు వేచి చూస్తే ఈ రెండు సినిమాలలో ఎటువంటి చారిత్రాత్మకమైన పాత్రలు పోషించిందో మనకు తెలుస్తుంది.