‘వర్ణ’గా మార్చిన అనుష్క ఆర్యల సినిమా

Arya_Anushka

అనుష్క, ఆర్య జంటగా నటిస్తూ సెల్వ రాఘవన్ తీస్తున్న సరికొత్త సినిమా ‘ఇరందం ఉలాగం’ కు తెలుగులో కొత్త టైటిల్ ను పెట్టారు. ఇదివరకు ఈ సినిమాకు ‘బృందావనంలో నందకుమారుడు’ అనుకున్నా ఇప్పుడు దానిని ‘వర్ణ’గా మార్చేసారు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోవుంది. ఈ సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుంది. అందులో ఒక పాత్రకుగానూ గిరిజన యువతిగా కనిపించనుంది. జార్జియా ప్రదేశంలో అద్బుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన సినిమా ప్రేక్షకులను విస్మయపరుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. తను అందించిన స్క్రిప్ట్ తో సినిమాను తియ్యడం కష్టమని కానీ అత్యంత కృషి పెట్టి ఈ సినిమాను తెరకెక్కించానని తెలిపారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. పి.వి.పి సినిమాస్ బ్యానర్ పై ప్రసాద్ వి.పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఈ ఏడాది ఆగష్టులో విడుదల అవుతుంది.

Exit mobile version