అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా

అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా

Published on Sep 12, 2025 8:05 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇపుడు పలు సినిమాలు వరుసగా చేస్తుంది. ఈ వారమే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రెండోసారి నటించిన చిత్రం “కిష్కింధపురి” అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన లేటెస్ట్ చిత్రం మరొకటి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఆ చిత్రమే “పరదా”.

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా కేవలం 3 వారాల్లోనే ఓటిటికి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. మరి అప్పుడు చూడకుండా మిస్ అయ్యినవారు ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు