నవదీప్, స్నేహా ఉల్లాల్ జంటగా నటిస్తున్న ‘అంతా నీ మాయలోనే’ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్లో జరుగుతుంది. ‘వరుడు’ సినిమాలో కనిపించిన భాను శ్రీ మెహ్రా ఈ సినిమాలో సెకండ్ హీరొయిన్. పి.వి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర వినోద్ నిర్మాత. ఇప్పటికే నవదీప్, స్నేహా ఉల్లాల్ మధ్య రెండు పాటలను చిత్రీకరించారు. ప్రస్తుతం టాకీ పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ “ఈ సినిమా రొమాన్స్ ఆధారంగా తీసిన మనసుకి హత్తుకునే చిత్రం. నవదీప్, స్నేహా ఉల్లాల్ పాత్రలు చాలా కొత్తగా వుంటాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 28న మొదలయ్యి మే 11 వరకూ కొనసాగుతుంది. ఇప్పటివరకూ తీసిన రెండు పాటల్లోనూ విజువల్ ఎఫెక్ట్స్ కు మంచి ఆస్కారంవుందని “అన్నారు. తదుపరి షెడ్యూల్ జూన్ 1నుండి మొదలవుతుంది. స్వరాజ్ సంగీతం అందించారు.