సరైన బాటలో పయనిస్తున్న ఆటోనగర్ సూర్య

Autonagar-Surya-getting-rea
నాగచైతన్య, సమంత నటించిన ‘ఆటోనగర్ సూర్య’ ప్రస్తుతం నిర్మాణదశ సాఫీగా సాగుతుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలకానుంది అన్నదాని పై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే నాగచైతన్య మరియు కిమయాలపై ఒక ఐటెమ్ సాంగ్ ను కూడా తెరకెక్కించారు.

ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా ఇంకో రెండు వారాలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు మిక్సింగ్ పూర్తవుతుందని తెలిపాడు. ఈ సినిమా విడుదలకు ఎన్నో అవాంతారాలు వున్నాయి. సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెలలో విడుదలకావట్లేదు. జనవరిలో విడుదలకు సిద్ధమవుతుంది. త్వరలో అధికారిక ప్రకటన చెయ్యనున్నారు.

కె ఆచ్చిరెడ్డి నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రాఫర్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రెయిలర్ కు విశేషస్పందన అందుకుంది.

Exit mobile version