డిస్ట్రిబ్యూటర్ల నుండి బంపర్ ఆఫర్ అందుకున్న ఆటోనగర్ సూర్య

Autonagar-Surya-Latest-Stil
నాగచైతన్య, సమంత లు నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ చివరిదశలో వుంది. దేవా కట్టా దర్శకుడు. కె అత్చి రెడ్డి నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మరింతపెంచింది. దర్శకుడు ఈ సినిమాపై చాలా నమ్మకంగా వున్నాడు. అతను గతంలో ప్రస్థానం సినిమాతో హిట్ కొట్టాడు.

ఇప్పుడు ఆటోనగర్ సూర్యకు డిస్ట్రిబ్యూటర్ల నుండి మంచి స్పందన వస్తుంది. దిల్ రాజు వైజాగ్ కు సంబంధించిన హక్కులను తీసుకోగా హరి పిక్చర్స్ నెల్లూరు హక్కులను సొంతం సొంతం చేసుకుంది. ఈ హక్కులను చాలా మంచి ధరకు తీసుకున్నారని సమాచారం. అంతేకాక ఓవర్ సీస్ హక్కులు కుడా చూడముచ్చటైన ధరకు సొంతం చేసుకున్నారు.

చైతు నటించిన ”తడాఖా” అటు డిస్ట్రిబ్యూటర్లకు ఇటు అభిమానులకు ఆనందాన్ని తెచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకూడా అదే రీతిలో ఆడుతుందని ఆశిస్తున్నారు. రస్తుతం బ్యాక్ గ్రౌండ్ మరియు మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తారు.

Exit mobile version