ఎఎన్ఆర్ ఆరోగ్యం బాగుంది – అక్కినేని ఫ్యామిలీ

akkineni-nageswara-rao
అప్డేట్ జనవరి 8. 9:43 నిమిషాలు : ఈ రోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలపై అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. పి.ఆర్.ఓ బిఏ రాజు నాగార్జున చెప్పిన ఓ స్టేట్మెంట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘నాన్నగారు బాగా కోలుకున్నారు, అన్ని విషయాల గురించి బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కలిసోచ్చానని నాగార్జున అన్నారని’ బిఏ రాజు ట్వీట్ చేసాడు.

ఈ విషయం పై హీరో సుమంత్ కూడా స్పందించాడు. ‘మా తాతయ్య అస్వస్థతకి గురయ్యారని వార్తలు వస్తున్నాయి. అ వార్తల్లో నిజం లేదు. ఎఎన్ఆర్ గారు బాగున్నారు. ఆయన బాగుండాలని కోరుకుంటున్న వారందరికీ ధన్యవాదాలని’ తెలిపాడు.

ఒరిజినల్ ఆర్టికల్ :

ప్రముఖ తెలుగు నటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఈ సమాచారం తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసింది. డా ఏఎన్ఆర్ గత కొద్ది రోజులకు ముందు క్యాసర్ వున్నట్టు ఆయనే స్వయంగా తెలియజేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి కొన్ని వారల క్రితం ఆయనకు చికిత్స కూడా చేయించుకున్నారు. కానీ నాగేశ్వర రావు గారికి చెందిన ఈ వార్త గత రాత్రి నుండి ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని సమాచారం. ఈ సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు గాని, అన్నపూర్ణ స్టూడియోస్ వారుగాని అధికారికంగా తెలియజేయలేదు.
ఏది ఏమైనా ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం .

Exit mobile version