ఫిల్మ్ నగర్ నుంచి మొదలైన ఏఎన్ఆర్ అంతిమ యాత్ర

anr-anthimayatra
తెలుగు చిత్ర పరిశ్రమ శ్రద్దాంజలి ఘటించడం కోసం కొద్ది సేపు ఏఎన్ఆర్ మృతదేహాన్ని ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. అక్కడి నుండి అంతిమ యాత్ర ఇప్పుడే మొదలైంది. ఆయన వాహనం మూడు అభిమానులు ఉప్పెనలా వస్తున్నారు. ఆయన వాహనం వెంబడే అందరూ తమ అడుగులు కదుపుతున్నారు. ఫిల్మ్ చాంబర్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు అన్నాపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ అంత్య క్రియలు జరుగుతాయి.

Exit mobile version