ప్రభాస్ నుంచి సాలిడ్ అనౌన్సమెంట్?

ప్రభాస్ నుంచి సాలిడ్ అనౌన్సమెంట్?

Published on Sep 1, 2020 8:03 AM IST

ఇప్పటికే డార్లింగ్ హీరో ప్రభాస్ ఒకదానిని మించిన ఒక ప్రాజెక్టులను వరుస పెట్టి అనౌన్స్ చేస్తూ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యారు. ఇపుడు వీటితోనే ప్రభాస్ అభిమానులు పట్టరాని ఆనందంతో ఎంజాయ్ చేస్తుంటే..ఇప్పుడు డార్లింగ్ నుంచి మరో భారీ అనౌన్స్మెంట్ రానున్నట్టుగా గట్టి బజ్ వినిపిస్తుంది. అది కూడా తొందరలోనే అన్నట్టుగా తెలుస్తుంది.

గత కొంత కాలం నుంచి ప్రభాస్ మరియు పవర్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో ఒక చిత్రం ఉండనుంది అని టాక్ వినిపించింది. మరి బహుశా దానికి సంబంధించిన ప్రకటనా? లేక మరే ఇతర సినిమానా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నుంచి దర్శకుడు రాధాకృష్ణతో “రాధే శ్యామ్”, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో “ఆదిపురుష్”, అలాగే నాగశ్విన్ తో ఒక స్కై ఫై థ్రిల్లర్స్ రానున్నాయి. మరి వీటి తర్వాత ప్రభాస్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందో చూడాలి.

తాజా వార్తలు