ఆర్.జి.వి పేరును వాడుకుంటూ మరో సినిమా?

ram-gopal-varma

బాక్స్ ఆఫీస్ దగ్గర తన ఘనమైన గతాన్ని గుర్తుతెచ్చే సినిమాలను రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తీయడంలేదు. అయినా రామూ ఫాలోయింగ్ లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. ఇటీవల రామూ క్రేజ్ ను వాడుకుంటూ సినిమాలు మొదలవుతున్నాయి. మొన్నీమధ్యే ‘డాటర్ ఆఫ్ వర్మ’ పేరుతో ఒక సినిమా విడుదలయింది. ఇప్పుడు హైదరాబాద్ లో ‘ఎ శ్యాం గోపాల్ వర్మ ఫిలిం’ అనే సినిమా మొదలయింది. అయితే హింసాత్మక సినిమాలు తీసే రామూకు మా సినిమాకు లింక్ లేదని దర్శకుడు రాకేశ్ శ్రీనివాస్ తెలిపాడు

ఈ సినిమాలో షఫీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రాము రాసిన ‘నా ఇష్టం’ పుస్తకాన్ని పోలినట్టు ‘నా సినిమా నా ఇష్టం’ అనే ఉపశీర్షిక ఉండడం మరో కొసమెరుపు. చూద్దాం మరి ఈ సినిమా ఎవర్ని ఉద్దేసించి తీసిందో

Exit mobile version