బాలయ్య బర్త్ డేకి మరో మాస్ ట్రీట్ ఖరారు!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు అవైటెడ్ అఖండ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ రానున్న జూన్ నెలలో బాలయ్య పుట్టినరోజు కానుకగా పలు ట్రీట్ లు తన సినిమాల నుంచి రానున్నాయి. ఇవి ఎలాగో ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ లేటెస్ట్ గా ఒక ఊహించని ట్రీట్ ఇప్పుడు ఖరారు అయ్యింది.

బాలయ్య నటించిన మాస్ హిట్ చిత్రాల్లో ఒకటైన “లక్ష్మీ నరసింహా” చిత్రం రీరిలీజ్ కి రావడం ఫిక్స్ అయ్యింది. మరి బాలయ్య పుట్టినరోజు జూన్ 10న కాగా దానికి ముందే జూన్ 7 నుంచి థియేటర్స్ లో రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు.

Exit mobile version