సినిమాల్లో కొంతమంది కాంబినేషన్స్ కి విపరీతమైన హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషనే హీరో సూర్య – డైరెక్టర్ హరిలది. తమిళ్ స్టార్ హీరోగా సూర్య, మాస్ డైరెక్టర్ గా హరి సూపర్ హిట్ చిత్రాలు తీసారు. ప్రస్తుతం సూర్య 39వ ప్రాజెక్ట్ ను కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సూర్య డబల్ రోల్స్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కవలలుగా పుట్టిన వాళ్లలో ఒక్కళ్ళు చెడు మార్గాన్ని ఎంచుకుంటే రెండో వాడు ఆ చెడును ఎలా ఆపాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోందట. మొత్తానికి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వీరిద్దరూ ఈ సారి రాబోతున్నారు.
పైగా సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని చూపిస్తూంటాడు హరి. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. వీరి ఇద్దరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ఆరు, వేల్, సింగం 1,2,3 సీక్వెల్స్ సూపర్ హిట్ అయ్యాయి. మొత్తానికి సూర్యతో హరి ఈ సారి హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. మరి ఈ హిట్ కాంబినేషన్ నుండి మరో హిట్ వస్తోందేమో చూడాలి.