‘కుబేర’ నుంచి డీఎస్పీ మ్యాజిక్ తో మరో సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!

‘కుబేర’ నుంచి డీఎస్పీ మ్యాజిక్ తో మరో సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!

Published on Jun 11, 2025 12:03 PM IST

కింగ్ నాగార్జున అలాగే టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో మన టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “కుబేర”. ఇప్పుడిప్పుడే మంచి బజ్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సరికొత్త సాంగ్ ని విడుదల చేశారు.

రష్మిక మందన్నాపై సాగే ఈ సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ ఫ్రెష్ ట్యూన్స్ తో అదరగొట్టేశారని చెప్పాలి. పిప్పి పిప్పి డుం డుం అంటూ సాగే ఈ సాంగ్ మొత్తం ఆంగ్ల పదాలతోనే క్యాచీగా సాగింది. ముఖ్యంగా ఆడపిల్లలకి రిలేషన్ షిప్ లో ఉండేకంటే సింగిల్ లైఫ్ లోనే ఉంటే బాగుంటుంది అనే కోణంలో సాగిన ఈ సాంగ్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పొచ్చు.

అలాగే రష్మిక అండ్ టీం ఈ సాంగ్ లో పర్ఫెక్ట్ గా కనిపించారు. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సహా అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా ఈ జూన్ 20న పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదల కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు