‘శర్వానంద్’ కొత్త సినిమాలో మరో హీరో ?

‘శర్వానంద్’ కొత్త సినిమాలో మరో హీరో ?

Published on Dec 7, 2025 7:03 AM IST

Sharwanand

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని, ఇది కీలక పాత్ర అని, ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని.. ఈ క్యారెక్టర్ లో ఓ మలయాళ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ‘మ్యాడ్‌’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్‌ కుమార్‌ హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘8 వసంతాలు’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. మరి శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

తాజా వార్తలు