ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం మూడు భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న “రాధే శ్యామ్” ముందు వరుసలో ఉంది. స్వచ్ఛమైన ప్రేమకావ్యంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అలాగే ఈ మధ్య కాలంలోనే ప్రభాస్ సినిమాలు సంబంధించి వరుస పెట్టి ప్రకటనలు వస్తుండడంతో డార్లింగ్ అభిమానులు మరింత ఖుషీగా ఉన్నారుఇదిలా ఉండగా షూటింగ్ కు మళ్ళీ రెడీ అవుతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇపుడు లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.
వచ్చే అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ యూనిట్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లే అరకొరగా ఉండడం వల్ల అప్పటికి సరైన ఫీస్ట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. మరి వారు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.