వరుసగా రెండో వారంతరం కూడా బాక్స్ ఆఫీస్ యొక్క కళ తప్పింది. ఏప్రిల్ నెల వస్తుందంటేనే ప్రతీ వారం ఒక్కో పెద్ద సినిమా క్యూలో ఉండేది. కానీ ఈ ఏడాది ఐ.పి.ఎల్ కు ఏర్పడ్డ క్రేజ్ కు మూలంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఈ నెల 24విడుదల కావాల్సివుండగా ఆ సినిమా 31కు వాయిదాపడింది. దీనివల్ల ఈ వారంతరంలో రెండు చిన్న బడ్జెట్ సినిమాలు రేపు విడుదలకానున్నాయి. అందులో తరుణ్, విమలా రామన్ నటించిన ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమా ఒకటి ‘143హైదరాబాద్’ అనే డబ్బింగ్ సినిమా మరొకటి. ఈ రెండు తెలుగు సినిమాలు కాకుండా ఫాస్ట్ అండ్ ఫ్యురియస్6 కుడా అనువాదం కానుంది. వీటిల్లో ఏ సినిమా పైన అంతగా అంచనాలు లేనందున బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు నమోదు కాకపోవచ్చు. మే 26 తో ఐ.పి.ఎల్ ముగుస్తుంది కనుక ఆ తరువాత నుండి మరిన్ని సినిమాలు ఆశించవచ్చు. చూద్దాం ఐ.పి.ఎల్ పూర్తయ్యాక అయినా తెలుగు తెర కొరతకు తెరపడుతుందేమో అని ..