పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. అయితే ఈ సినిమాలో శ్రీలీల కాకుండా మరో బ్యూటీ కూడా ఉంటుంది అని లేటెస్ట్ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదట బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా అని తెలుస్తోంది.
రాశి పవన్ కాంబినేషన్లో ఎప్పుడు నుంచో పవన్ అభిమానులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు సెట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. శ్రీ లీల మెయిన్ హీరోయిన్ రాశి ఖన్నా రెండో హీరోయిన్ అట. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.