ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా టైటిల్ ‘హార్ట్ ఎటాక్’. ఈ సినిమాకి అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుండి మొదలయ్యె అవకాశం వుంది. ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారం కొద్దిరోజుల్లో తెలియవచ్చు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రుబెన్స్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. తనుఇప్పుడిప్పుడే పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ మంచి పేరును సంపాదించుకుంటున్నాడు. తను ఈ మద్య యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాకి సంగీతాన్ని అందించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తే తనకి మంచి అవకాశాలు వచ్చేఅవకాశం ఉంది. ‘హార్ట్ ఎటాక్’ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ , మంచి ఎమోషినల్ సినిమాగా తెరకెక్కనుంది అని సమాచారం.