ఎం.ఎం కీరవాణి సినీ జీవితంలో మరుపురాని సినిమా ఏది??

Keeravani
తెలుగు సినిమాలో తనకంటూ ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్న సంగీత దర్శకులలో ఎం.ఎం కీరవాణి ఒకరు. ఈయన రెండు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరిస్తున్నారు. కె. రాఘవేంద్ర రావు తీసిన ‘అన్నమయ్య’ ఆయన జీవితంలోనే ఒక పెద్ద మలుపు అని తెలిపారు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అత్యంత మధురమైన భక్తి రసాత్మక తెలుగు సినిమాలలో ఒకటిగా నిలిచింది.

‘అంతకుముందు ఆ తరువాత’ సినిమా గురించి మాట్లాడుతూ “సంగీతం నా జీవితం. అది తప్ప నాకు మరొక పని తెలీదు. నేను 90వ దశకంలో చేసిన పాటలకు సంతోషపడేవాడిని, కానీ అవన్నీ ఒక్క ‘అన్నమయ్య’ సినిమా మార్చేసింది. ఈ సినిమా ద్వారా నాకు లబించిన గుర్తింపు ద్వారా నాకు రెండు భాద్యతలు వచ్చాయి. నాపై అంచనాలు మరింత పెరిగాయి. పాటలు విడుదలైన తరువాత ప్రతీ ఒక్కరూ నన్ను ఆదరించడం మొదలుపెట్టారు. నేను ‘అన్నమయ్య’కు ముందు అనుభవించిన స్వేచ్చను ఇప్పుడు అనుభవించలేకపోతున్నాను, కానీ ఆ సినిమా నాకు చేసిన మేలును ఎన్నటికీ మరువలేను. అందుకే ‘అన్నమయ్య’ నా జీవితంలో ఒక మరుపురాని మైలురాయని” తెలిపారు

Exit mobile version