ఈ చిత్రమైన తెలుగులో అంజలి దశ మారుస్తుందా?

ఈ చిత్రమైన తెలుగులో అంజలి దశ మారుస్తుందా?

Published on Jul 23, 2012 5:23 PM IST


విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా తెలుగులో భారీగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ‘షాపింగ్ మాల్’, ‘గ్యాంబ్లర్’ మరియు ‘జర్నీ’ చిత్రాల ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న అంజలి ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మొదట ఈ పాత్రకి అనుష్క మరియు త్రిషలను సంప్రదించారు, కానీ వారు ఒప్పుకోకపోవడంతో అంజలికి ఆ పాత్ర చేసే అవకాశం దక్కింది. అంజలి చాలా బాగా నటిస్తున్నారని దిల్ రాజు ఇదివరకే అన్నారు. అంజలి తెలుగులో అనువాదమైన సూపర్ హిట్ తమిళ చిత్రాల ద్వారా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తెలుగులో మాత్రం సరైన అవకాశాలు రాలేదు. చాలా కాలం తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో తనకి తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని మరియు ఈ చిత్రం తన కెరీర్ కి గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుందని అంజలి భావిస్తున్నారు.

అంజలి కథానాయికగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. కొత్తగా పెళ్లై కాపురానికి వచ్చిన యువతి ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాఖీ సందర్భంగా ఆగష్టు 2న విడుదలచేయనున్నారు.

తాజా వార్తలు