అంజలి ఈ సారి అరెస్టే.!

Anjali

ఈ సంవత్సరం వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కాస్త ముద్దుగా బొద్దుగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న అంజలి ప్రస్తుతం చిక్కుల్లో ఉందనే చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం ఈ భామ తన పిన్ని, డైరెక్టర్ కళంజియంలు తనని ఇబ్బంది పెడుతున్నారని కొద్ది రోజులు అంజలి కనపడకుండా పోయిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అంజలి ఈ విషయాన్ని సింపుల్ గా ముగించేసినా డైరెక్టర్ కళంజియం మాత్రం అంజలి పై పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ కేసు ఇంకా కొలిక్కి రాకుండా కొనసాగుతూనే ఉంది దీనికి కారణం ఒక్కసారి కూడా అంజలి కోర్టుకు హాజరు కావడమే.. ఈ కేసు విషయంలో ఈ రోజు అంజలి సైదాపేట కోర్టుకి హాజరు కావలసి ఉంది కానీ ఆమె రాలేదు. దాంతో కేసుని 12వ తేదీకి వాయిదా వేసిన కోర్టు అంజలి చివరి చాన్స్ ఇచ్చింది. 12 వ తేదీ ఆమె కోర్టుకి హాజరు కాకపోతే ఆమె అంజలి పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని అంజలికి కోర్టు వార్నింగ్ ఇచ్చింది.

Exit mobile version