మలయాళం సినిమా తీస్తున్న ఆవకాయ్ బిర్యానీ దర్శకుడు

Anish-Kuruvilla

‘ఆవకాయ్ బిర్యానీ’ మరియు ‘కో అంటే కోటి’ సినిమాల దర్శకుడు అనీష్ కురివిల్లా త్వరలో మలయాళంలో తొలి సినిమా తియ్యనున్నాడు. గత యేడాది శర్వానంద్, ప్రియా నటించిన ‘కో అంటే కోటి’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో సంగీతం, సినిమాటోగ్రాఫి మరియు ప్రధాన తారల నటనను మెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

దాదాపు యేడాది కాలం తరువాత అనీష్ కురివిల్లా ‘కప్ప పప్పడం’ అనే సినిమాను ఫాహద్ ఫజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో చేయనున్న ఫాహద్ ’22 ఫిమేల్ కొట్టాయం’, ‘ఆమెన్’, ‘నార్త్ 24 కాథమ్’ వంటి గతసినిమాలతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై కొచ్చి, బెంగళూరు లో చిత్రీకరణ జరుపుకుంటుంది. పార్వతి మీనన్, ప్రతాప్ పోతెన్ ముఖ్య పాత్రధారులు. వై.వి రాజేష్ స్క్రిప్ట్ ను అందించాడు

Exit mobile version