ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బకాసుర రెస్టారెంట్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎస్‌జే శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని ‘బకాసుర’ టైటిల్ ర్యాప్ సాంగ్‌ను బ్లాక్‌బస్టర్ మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. వికాస్ బడిస స్వరాలు సమకూర్చిన ఈ పాటను ర్యాప్ సింగర్ రోల్ రైడ్, వికాస్ బడిస ఆలపించారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “బకాసుర రెస్టారెంట్ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా చాలా బాగుంది. కొత్తగా అనిపించింది. సినిమా ఐడియా కూడా నచ్చింది. నటుడు ప్రవీణ్ నాకు మొదటి నుంచే తెలుసు. ఆయన హీరోగా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు ఎస్‌జే శివతో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు,” అన్నారు.
దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ, “హంగర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని అందిస్తుంది. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. అనిల్ రావిపూడి గారు మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది,” అన్నారు.